సారా కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
ABN , First Publish Date - 2021-12-16T05:15:03+05:30 IST
తుని, డిసెంబరు 15: నాటుసారా విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించినట్టు పట్టణ సీఐ ఆదిరెడ్డి సన్యాసిరావు తెలిపారు. వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబరు 22న తుని పట్టణం కొండవారిపేట రావిచెట్టు వద్ద సారా అమ్మకంచేస్తూండగా ఎస్‌ఐ శ్రీనివాసకుమా

తుని, డిసెంబరు 15: నాటుసారా విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించినట్టు పట్టణ సీఐ ఆదిరెడ్డి సన్యాసిరావు తెలిపారు. వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబరు 22న తుని పట్టణం కొండవారిపేట రావిచెట్టు వద్ద సారా అమ్మకంచేస్తూండగా ఎస్‌ఐ శ్రీనివాసకుమార్ సోమాల నాగరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌లో పెట్టారు. తుని కోర్టులో వాదోపవాదనల తర్వాత న్యాయమూర్తి ఎస్.వెంకటేశ్వరెడ్డి తీర్పుఇచ్చారు. నిందితుడు నాగరాజుకు మూడేళ్ల జైలు, రెండు లక్షల జరిమానా విధించారు. ఈ కేసులో ఏపీపీగా ఎన్.సునీత ప్రాసిక్యుషన్‌గా వ్యవహరించినట్టు సీఐ తెలిపారు.