‘ఇసుక ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు ఆపాలి’

ABN , First Publish Date - 2021-12-30T07:07:24+05:30 IST

గడువు ముగిసినప్పటికీ ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు.

‘ఇసుక ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు ఆపాలి’

రావులపాలెం రూరల్‌, డిసెంబరు 29: గడువు ముగిసినప్పటికీ ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. రావులపాలెంలోని టీడీపీ మండల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. గుత్తుల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, వెలగల శ్రీనివాసరెడ్డి, పడాల కొండారెడ్డి, సాధనాల సత్యనారాయణ, సిద్దిరెడ్డి శ్రీను, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-30T07:07:24+05:30 IST