తొలుచు పురుగులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-02-01T06:03:08+05:30 IST
సామర్లకోట, జనవరి 31: రబీ వరిసాగులో పలు ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగుల వ్యా ప్తిని గుర్తించామని, వీటి నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వ్యవసాయ సహా య సంచాలకురాలు, సామర్లకోట వ్యవసాయ పరి శోధనాకేంద్ర అధికారి జీవీ.పద్మశ్రీ పేర్కొన్నారు.

సామర్లకోట, జనవరి 31: రబీ వరిసాగులో పలు ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగుల వ్యా ప్తిని గుర్తించామని, వీటి నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వ్యవసాయ సహా య సంచాలకురాలు, సామర్లకోట వ్యవసాయ పరి శోధనాకేంద్ర అధికారి జీవీ.పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో సామర్లకోట, పెదపూడి, కాకినాడ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాండం లోపల కణుపుల మధ్య భాగమంతా నల్లగా మారడం, ఆకులు పసుపు రంగులోకి మారడంతో పిలకలు కిందికి వాలిపోయి క్రమంగా దుబ్బు అంతా ఎండిపోతుందన్నారు. తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలన్నారు. పైరు ఆరోగ్యంగా ఎదిగేలా పోషకాలు అందించాలన్నారు. ప్రారంభ దశలో తెగులు లక్షణాలను గుర్తించి హెక్సాకొనజోల్ 2 మి.లీ. మందు (లేదా) కార్బండైజమ్ 1 గ్రాము మ ందు (లేదా) వాలిడామైసిన మందు ద్రావణాన్ని ఏదైనా ఒక దానిని లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజులకోసారి రెండుదఫాలు పిలకలు తడిచేవరకూ పిచికారీ చేయాలని పేర్కొన్నారు.