అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2021-10-22T05:27:14+05:30 IST
ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వహ ణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఏఎస్పీ కృష్ణకాంత్ అన్నారు.

- ఏఎస్పీ కృష్ణకాంత్.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
ఎటపాక, అక్టోబరు 21: ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వహ ణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఏఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాలను చూపించి పోలీసుల విధులు, స్టేషన్ పనితీరును వివరించారు. ఎస్‌ఎల్‌ఆర్, ఏకే47, కార్బన్ తదితర ఆయుధాలను ఏ విధంగా వినియోగించాలో తెలియజెప్పారు. సీఐ గజేంద్రకుమార్, ఎస్‌ఐలు జ్వాలా సాగర్, చినబాబు పాల్గొన్నారు.