కాలుజారి సీలేరు నదిలో గల్లంతైన యువకుడు

ABN , First Publish Date - 2021-03-22T06:01:20+05:30 IST

చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పొల్లూరులో కాలు జారి సీలేరు నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.

కాలుజారి సీలేరు నదిలో గల్లంతైన యువకుడు

మోతుగూడెం, మార్చి 21: చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పొల్లూరులో కాలు జారి సీలేరు నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. డొంకరాయికి చెందిన ఆటోడ్రైవర్‌  గంగిరెడ్ల  రాంబాబు(22) బహిర్భూమికని సీలేరు నది ప్రాంతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి గల్లంతైనట్లు సమాచారం. ఆ యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-03-22T06:01:20+05:30 IST