రైతులను నట్టేట ముంచడం తగదు

ABN , First Publish Date - 2021-04-29T05:49:26+05:30 IST

రైతులను నట్టేట ముంచడం ప్రభుత్వానికి తగదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి అన్నారు.

రైతులను నట్టేట ముంచడం తగదు

 మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 

అనపర్తి, ఏప్రిల్‌ 28: రైతులను నట్టేట ముంచడం ప్రభుత్వానికి తగదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించా లని డిమాండ్‌ చేస్తూ అనపర్తిలోని తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల కార్యాలయాలవద్ద బుధవారం ధర్నా నిర్వహించి అధికా రులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రక టించినట్టుగా 75 కిలోల బస్తాకు రూ.1401 చొప్పున వెంటనే ధాన్యం కొనుగోలు చేసి సొమ్ములు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మార్చి నెలాఖరు నాటికి కోతలు పూర్తి చేయాలని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. 

గతేడాది ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ చెల్లించక రైతులు నష్టపోయా రన్నారు. రైతులకు ఉపయోగంలేని రైతు భరోసా కేంద్రా లు ఎందుకోసమని ప్రశ్నించారు. తహసీల్దార్‌ కార్యాల యంలో డిఫ్యుటీ తహసీల్దార్‌ శశిధర్‌కు, వ్యవసాయశాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులు కృష్ణకు వినతి పత్రాలు అందజేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకు లు సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, పులగం అచ్చిరెడ్డి, అశోక్‌రెడ్డి, నూతిక బాబూరావు, సోమరాజు, మామిడిశెట్టి శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2021-04-29T05:49:26+05:30 IST