రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భార కేంద్రాలు

ABN , First Publish Date - 2021-12-26T05:43:51+05:30 IST

రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం రైతులకు భారమైన కేంద్రాలుగా మారా యని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భార కేంద్రాలు

అనపర్తి, డిసెంబరు 25: రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం రైతులకు భారమైన కేంద్రాలుగా మారా యని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రామవరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ రైతు భరోసా కేంద్రాల్లో తనిఖీలు నిర్వ హించడం చూస్తుంటే ఇల్లు కాలుతుండగా నుయ్యి తవ్వినట్టు ఉందన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన రైసుమిల్లులపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. సమావేశం లో సిరసపల్లి నాగేశ్వరరావు, పులగం అచ్చిరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:43:51+05:30 IST