నేడు రుడా కార్యాలయం ప్రారంభం... మంత్రి బొత్స రాక

ABN , First Publish Date - 2021-08-27T07:21:49+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు.

నేడు రుడా కార్యాలయం ప్రారంభం... మంత్రి బొత్స రాక

రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని గుడా జోనల్‌ ఆఫీసును రుడా కార్యాలయంగా మార్చారు. రుడా చైర్‌పర్సన్‌గా మేడపాటి షర్మిళారెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇంకా మంత్రులు కన్నబాబు, వేణు, విశ్వరూప్‌ తదితరులు కూడా రానున్నారు. ఈ సందర్భం గా నగరంలోని పలు రహదారులు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

Updated Date - 2021-08-27T07:21:49+05:30 IST