ఎస్.అగ్రహరం పంచాయతీ ఏకగ్రీవంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-02-06T06:06:23+05:30 IST
రౌతులపూడి, ఫిబ్రవరి 5: ఎస్.అగ్రహరం పంచాయతీని ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారని కొట్లు అప్పలరాజు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ర్‌కు ఫిర్యాదు చేశా డు

రౌతులపూడి, ఫిబ్రవరి 5: ఎస్.అగ్రహరం పంచాయతీని ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారని కొట్లు అప్పలరాజు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ర్‌కు ఫిర్యాదు చేశా డు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ‘గత నెల 29న గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశాను. ఈనెల 4న గుర్తు కోసం ఆర్వో దగ్గరకు వెళ్లగా నేను నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నట్టు చూపి అన్యాయంగా ఏకగ్రీవం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాను’ అని ఆయన పేర్కొన్నారు.