రహదారులను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2021-03-14T06:52:30+05:30 IST

బొబ్బర్లంక-అమలాపురం ప్రధాన రహదారిని పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేయాలని కోనసీమ అభివృద్ధి సాధనసమితి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి వినతిపత్రం అందజేసింది.

రహదారులను అభివృద్ధి చేయండి

ఎమ్మెల్యేకు వినతి

కొత్తపేట, మార్చి 13:  బొబ్బర్లంక-అమలాపురం ప్రధాన రహదారిని పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేయాలని కోనసీమ అభివృద్ధి సాధనసమితి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి వినతిపత్రం అందజేసింది. శనివారం సమితి అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి రామకృష్ణ ఆధ్వర్యంలో సమితి సభ్యులు ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు వినతిపత్రాలు అందించారు.  కొత్తపేట మీదుగా కాకినాడకు బస్సుసౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సాధనసమితి ప్రధాన కార్యదర్శి రాయుడు శ్రీనివాస్‌, గౌరవ సలహాదారుడు ఎస్‌.ఆదిత్యకిరణ్‌, ఉపాధ్యక్షుడు వాడపల్లి సూరిబాబు, కొప్పిశెట్టి వాసు, పాలింగి మూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-14T06:52:30+05:30 IST