లారీని ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-02-08T05:42:55+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడు సెంటర్‌లో ఆదివారం సాయ ంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీని ఢీకొని యువకుడి మృతి

రాజమహేంద్రవరంరూరల్‌, ఫిబ్రవరి 7: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడు సెంటర్‌లో ఆదివారం సాయ ంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం క్వారీసెంటర్‌ టీవీ రోడ్డుకు చెందిన అజయ్‌(20) అతని స్నేహితులతో కలిసి మోటారుసైకిల్‌పై గండి పోశమ్మ గుడికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా తొర్రేడు సెంటర్‌లో సీతానగరం వైపునకు వెళుతున్న లారీని వారి మోటారుసైకిల్‌ ఢీకొట్టడంతో అజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-08T05:42:55+05:30 IST