దంపతులకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-12-26T05:45:30+05:30 IST

మండలంలోని ఇప్పనపాడు రైస్‌మిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.

దంపతులకు తీవ్రగాయాలు

చికిత్స పొందుతూ భర్త మృతి
మండపేట, డిసెంబరు 25: మండలంలోని ఇప్పనపాడు రైస్‌మిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. రూరల్‌ ఎస్‌ఐ శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.... మండపేట మండలం చిన ద్వారపూడికి చెందిన దంపతులు పంపన గోవిందు, రాధాకుమారి మోటారు సైకిలుపై మండపేట బయల్దేరారు. రామచంద్రపురం నుంచి ద్వారపూడి వైపు వస్తున్న కారు ఇప్పనపాడు రైస్‌మిల్లు వద్ద వారిని ఢీకొంది. తీవ్ర గాయాలైన గోవిందును 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. రాధాకుమారి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-26T05:45:30+05:30 IST