రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-10-15T05:15:58+05:30 IST

జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడి గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్రత్తిపాడు, అక్టోబరు14:  జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడి గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. గజ్జెనపూడి గ్రామానికి చెందిన 12 మంది టాటా మ్యాక్సీ వాహ నంలో విజయవాడ దుర్గమ్మ దర్శనానికి బయల్దేరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున దేవరపల్లి వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లోకా నాగు (35), అతని కుమార్తె వీరలక్ష్మి(4) అక్కడికక్కడే మృతి చెందారు. ఆబోతు అప్పలరాజు, కొల్లు సత్యవతి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. గజ్జెనపూడిలోని బంధువులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గ్రామ సర్పంచ్‌ గొనగాల అప్పలరాజు, గ్రామ ప్రముఖుడు పల్లా గోపి దేవరపల్లి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. తండ్రీ, కుమార్తెలైన  నాగు వీరలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి గురువారం సాయంత్రం గజ్జెనపూడి తీసుకువచ్చారు.

Updated Date - 2021-10-15T05:15:58+05:30 IST