40 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-08-10T05:46:45+05:30 IST

ఏలేశ్వరంలోని లింగవరం కాలనీ ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం సాయంత్రం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

40 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

ఏలేశ్వరం, ఆగస్టు 9: ఏలేశ్వరంలోని లింగవరం కాలనీ ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం సాయంత్రం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం పౌర సరఫరాల అధికారి కేవీఎస్‌ఎం ప్రసాద్‌ నేతృత్వంలో ఏలేశ్వరం, తుని, జగ్గంపేట, కోటనందూరు మండలాల పౌర సరఫరాల శాఖ అధికారులు, డిఫ్యూటీ తహశీల్దార్లు షేక్‌ ఇస్మాయిల్‌, బీవీ రామారావు, జీఎం కృష్ణ, ఎస్‌కే ఆలీషా, ఏలేశ్వరం ఆర్‌ఐ ఎస్‌.పొన్నా దాడులు నిర్వహించారు. ఒక ఇంటిలో 95 బస్తాల్లో నాలుగు మెట్రిక్‌ టన్నులు (40 క్వింటాళ్లు) బియ్యం నిల్వ ఉండడం గుర్తించారు. ఏలేశ్వరం తహశీల్దారు రజనీకుమారి, వీఆర్వో సమక్షంలో ఇంటిలో తనిఖీలు పూర్తిచేసి బియ్యం నిల్వల లెక్కింపు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 84 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. రూ.10 వేలు విలువైన రెండు ఎలక్ర్టానిక్‌ తూకం కాటాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించగా నెలకు రూ.1000 వంతున ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకు తీసుకున్నాడని, బియ్యం బస్తాలు నిల్వ ఉంచిన అతని వివరాలు తెలియవని తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పట్టణంలోని గిరిజన కార్పొరేషన్‌ కార్యాలయంలో గల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించినట్టు పెద్దాపురం పౌరసరఫరాల శాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు

Updated Date - 2021-08-10T05:46:45+05:30 IST