ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-12-09T06:04:29+05:30 IST

ఇంటి వద్ద ఆడుకునే అయిదేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన కడియం మండలంలోని ఒక గ్రామంలో జరిగింది.

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

కడియం, డిసెంబరు 8: ఇంటి వద్ద ఆడుకునే అయిదేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన కడియం మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖ జిల్లా నుంచి నర్సరీలో పని చేసుకునేందుకు తమ ఇద్దరు కుమార్తెలతో భార్యాభర్తలిద్దరూ ఆ గ్రా మానికి వచ్చారు. తల్లిదండ్రులిద్దరు నర్సరీ కూలీలు కావడంతో రోజు మాదిరిగానే కూలీ పనికెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆచూకీ కోసం వెతి కారు. ఇంతలో వారి కుమార్తె కన్నమనాయుడు అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారిపై కన్నమనాయుడు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి చిన్నారి తల్లి పోలీసు లను ఆశ్రయించింది. ఎస్‌ఐ ఎస్‌కే అమీనాబేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశా డీఎస్పీ తిరుమలరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుణిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-09T06:04:29+05:30 IST