రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-11-21T06:24:21+05:30 IST

గండేపల్లి, నవంబరు 20: మండలంలోని మల్లేపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం... రాజమహేంద్రవరం వైపు నుంచి జగ్గంపేట వైపు వెళ్తున్న రెండు లారీల్లో ఓ లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో మరోలారీ

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలు

గండేపల్లి, నవంబరు 20: మండలంలోని మల్లేపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం... రాజమహేంద్రవరం వైపు నుంచి జగ్గంపేట వైపు వెళ్తున్న రెండు లారీల్లో ఓ లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో మరోలారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్‌ కాలు క్యాబిన్‌లో చిక్కుకుని గాయాలయ్యాయి. స్థానికులు ప్రొక్లెనర్‌ సాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-11-21T06:24:21+05:30 IST