ఇంటి దొంగల పనేనా..?

ABN , First Publish Date - 2021-09-02T06:02:45+05:30 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో దొంగలు పడి ఎత్తుకెళ్లిన నగదు పెట్టె విచిత్రంగా ఆ కార్యాలయం ప్రాంగణంలోనే దొరికింది. అందులో రూ.4లక్షల నగదు మాతమ్రే దొరికినట్టు తెలిసింది.

ఇంటి దొంగల పనేనా..?

  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ప్రాంగణంలోనే దొరికిన నగదు పెట్టె
  • రూ.6లక్షలు మాయం!

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 1: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో దొంగలు పడి ఎత్తుకెళ్లిన నగదు పెట్టె విచిత్రంగా ఆ కార్యాలయం ప్రాంగణంలోనే దొరికింది. అందులో రూ.4లక్షల నగదు మాతమ్రే దొరికినట్టు తెలిసింది. బుధవారం నగరపాలక సంస్థ పాత భవనం సమీపంలో నగదు పెట్టె పడేసి ఉంది. ఆ పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని అందరూ భావించారు. తెల్లవారేసరికి ఆ నగదు పెట్టె కార్పొరేషన్‌ ప్రాంగణంలోనే దొరకడం విశేషం. అందులో రూ.10లక్షల11వేల నగదుకుగాను రూ.4లక్షలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇది కచ్చితంగా తెలిసినవారు చేసిన పనే అనేది నిర్ధారణ అయ్యింది. ఆ పెట్టెను క్లూజ్‌ టీమ్‌ పరిశీలన చేసింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-09-02T06:02:45+05:30 IST