ప్రార్థనా స్థలంలో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణమా?

ABN , First Publish Date - 2021-03-14T07:20:57+05:30 IST

గోకవరం మండలం గాదెలపాలెంలో ప్రార్థనా స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులను శనివారం ఆ గ్రామ మహిళలు అడ్డుకున్నారు. 18ఏళ్లుగా ప్రార్థనా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్న స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి సచివాలయ అధికారులు తీసుకున్న చర్యలకు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రార్థనా స్థలంలో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణమా?
ఆందోళనకు దిగిన మహిళలు

  • గాదెలపాలెంలో అడ్డుకున్న మహిళలు

గోకవరం, మార్చి 13: గోకవరం మండలం గాదెలపాలెంలో ప్రార్థనా స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులను శనివారం ఆ గ్రామ మహిళలు అడ్డుకున్నారు. 18ఏళ్లుగా ప్రార్థనా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్న స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి సచివాలయ అధికారులు తీసుకున్న చర్యలకు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2003లో సర్వే నెంబరు 247/2లో 14సెంట్లు భూమిని పిల్లి రామయ్య దగ్గరనుంచి మాజీ సర్పంచ్‌ రైతు నాయకుడు ముత్యం వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి ఆ భూమిని క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు దాఖలు చేశామని ఆందోళనకారు లు తెలిపారు. అప్పటినుంచి చర్చి ద్వారా ఆ స్థలంలో సేవా కార్యక్రమాలు, ప్రార్థనా కూడికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్థలంలో ప్రార్థనా సేవా కార్యక్రమాలు నిర్వ హించుకునేందుకు అవసరమైన భవన నిర్మాణ పనులు ప్రారంభించగా అక్కడ వేసు కున్న నిర్మాణపు సామగ్రిని సచివాలయ సిబ్బంది ధ్వంసం చేసి, అదే స్థలంలో రైతు భ రోసా కేంద్రం భవన నిర్మాణం కోసం మార్కింగ్‌ ఇవ్వడంపై మహిళలు భగ్గుమన్నారు. దీంతో అదే స్థలంలో పలువురు గ్రామస్థులు శిబిరం ఏర్పాటు చేసి ధర్నా చేసి సాయం త్రం వరకు భైఠాయించారు. స్థలానికి ఎదురుగా ఖాళీగా ఉన్న వేరే స్థలాన్ని రైతు భరో సా కేంద్రానికి ప్రత్యామ్నాయంగా చూపిస్తామని పెద్దలు చెబుతున్నప్పటికీ సచివాల య సిబ్బంది చర్చి సభ్యులపై వేధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. అదే స్థలంలో రైతుభరోసా కేంద్రం నిర్మాణం చేపట్టాలని పట్టుబట్టడం ఆందోళన కల్గిస్తోందన్నారు. తామంతా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వద్దకు వెళ్లి సమస్య వివరించి వచ్చే సమ యానికి తాము వేసుకున్న ఇసుక, ఇటుక, తదితర సామగ్రిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T07:20:57+05:30 IST