‘పునరావాసం పూర్తయ్యేవరకూ పోలవరం పనులు ఆపాలి’
ABN , First Publish Date - 2021-07-08T07:03:24+05:30 IST
లవరం కాపర్ డ్యాం పూర్తిగా మూసివేయడం వల్ల సాధారణ వరదలకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

భానుగుడి (కాకినాడ), జూలై 7: పోలవరం కాపర్ డ్యాం పూర్తిగా మూసివేయడం వల్ల సాధారణ వరదలకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిపక్షం నేతలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యూ డెమోక్రసీ నాయకుడు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేయించడం దుర్మార్గమని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పోలవరం గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెళ్లగొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కెఎస్ శ్రీనివాస్, డి శేషుబాబ్జి, జి.బేబిరాణి పాల్గొన్నారు.