ఎట్టకేలకు మంత్రులకు శాఖల కేటాయింపు

ABN , First Publish Date - 2021-07-12T06:01:13+05:30 IST

పుదుచ్చేరి మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. ఆదివారం సీఎం ఎన్‌.రంగసామి రాజ్‌నివాస్‌కు వెళ్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసైను సత్కరించారు.

ఎట్టకేలకు మంత్రులకు శాఖల కేటాయింపు

యానాం, జూలై 11: పుదుచ్చేరి మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. ఆదివారం సీఎం ఎన్‌.రంగసామి రాజ్‌నివాస్‌కు వెళ్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసైను సత్కరించారు. అనంతరం మంత్రులశాఖల కేటాయింపునకు సంబంధించిన నివేదికను అందించారు.  కాన్ఫిడేషియల్‌, క్యాబినెట్‌, సహకార శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్‌, జనరల్‌ అడ్మినిస్టేషన్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, స్వపరిపాలనాశాఖ, పోర్టు, సైన్స్‌టెక్నాలజీ, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌, సమాచార ప్రసారశాఖ, మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖలు ముఖ్యమంత్రి రంగసామివద్దే ఉన్నాయి.  ఎ.నమశ్శివాయఃకు హోంశాఖ, విద్యుత్‌, పారిశ్రామిక, విద్య, క్రీడలు, సైనిక్‌ వెల్ఫేర్‌, కె.లక్ష్మీనారాయణకు ప్రజపనులశాఖ, పర్యాటక, విమానాయన, మత్స్య, న్యాయ, సాంకేతిక, స్టేషనరీ ప్రింటింగ్‌శాఖలు, సి.జైకుమార్‌కు వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ, సాంఘిక, వెనుకబడిన తరగతుల, స్త్రీశిశు సంక్షేమశాఖలు కేటాయించారు. చంద్రప్రియాంకాకు రవాణశాఖ, అదిద్రాడిడా, గృహనిర్మాణం, కార్మిక, ఉపాధి, కళలు సాంస్కృతిక, ఎకానమిక్స్‌ స్టాటటిక్స్‌శాఖలు,  ఎకెసాయిజె సార్వణన్‌కుమార్‌కు పౌరసరఫరాలశాఖ, డీఆర్‌డీఏ, కమ్యూనిటి డెవలప్‌మెంట్‌, అర్బన్‌ బేసిస్‌ సర్వీసస్‌,ఫైర్‌, మైనారిటీ శాఖలను కేటాయించారు. 

 

Updated Date - 2021-07-12T06:01:13+05:30 IST