పుదుచ్చేరి గవర్నర్‌తో మల్లాడి భేటీ

ABN , First Publish Date - 2021-10-21T05:37:50+05:30 IST

పుదుచ్చేరి గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతి నిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు.

పుదుచ్చేరి గవర్నర్‌తో మల్లాడి భేటీ

యానాం, అక్టోబరు 20: పుదుచ్చేరి గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతి నిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం రాజ్‌నివాస్‌లో తొలిసారి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ముందుగా గవర్నర్‌ మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం యానాంకు సంబంధించి 15 పెండింగ్‌ అంశాలపై మరోమారు వినతిపత్రం అందిచారు. అనంతరం  సుమారు 30 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసైకు మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు.Updated Date - 2021-10-21T05:37:50+05:30 IST