ప్రజాసమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం
ABN , First Publish Date - 2021-07-24T05:48:23+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం గా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజా నాథ్ పిలుపునిచ్చారు.

- పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్
- రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయం పరిశీలన
రాజమహేంద్రవరం సిటీ, జూలై 23: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం గా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజా నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆయనకు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బోడా వెం కట్, పీసీసీ నాయకులు ముళ్ళ మాధవ్, బెజవాడ రంగా, అబ్ధుల్లా షరిఫ్, ఉపాధ్యక్షుడు చింతాడ వెంకటేశ్వర్లు, చామర్తి లీలావతి, యిజ్జరౌతు విజయలక్ష్మి స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయం రిజిస్టర్‌లో ఆయన సంతకం చేశారు. కార్యక్రమంలో శెట్టి ప్రతాప్, కంచర్ల రామారావు, తురగ సూర్యనారా యణ, కృష్ణ, మధుమణి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గట్టి నవతారకేష్, గుత్తుల ప్రేమ్ భాస్కర్, హరీష్, నందు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎల్‌బీ శాస్ర్తి రోడ్డులోని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హర్షకుమార్ నివాసానికి శైలజానాథ్ వెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు హర్షకుమార్‌తో చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జీవి శ్రీరాజ్, ఎన్‌వీ శ్రీనివాస్, గోలి రవి పాల్గొన్నారు.