సంతృప్తికర సేవలే తపాలా శాఖ లక్ష్యం

ABN , First Publish Date - 2021-01-20T06:06:46+05:30 IST

ఖాతాదారులకు సంతృ ప్తికర సేవలు అందిచడమే తపాలాశాఖ లక్ష్యమని విజయవాడ సర్కిల్‌ అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ మల్లాది హరిప్రసాద్‌ శర్మ అన్నారు.

సంతృప్తికర సేవలే  తపాలా శాఖ లక్ష్యం

రాయవరం, జనవరి 19: ఖాతాదారులకు సంతృ ప్తికర సేవలు అందిచడమే తపాలాశాఖ లక్ష్యమని విజయవాడ సర్కిల్‌ అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ మల్లాది హరిప్రసాద్‌ శర్మ అన్నారు. మంగళవారం వెదురుపాకలో జరిగిన విజయదుర్గా పీఠాధిపతి గాడ్‌  జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, ఏటీఎం సౌకర్యాలు, పాస్‌పోర్టు, ఆధార్‌ స్పీడ్‌పోస్టు, సేవింగ్స్‌, ఇన్సూరెన్స్‌ పథకాలు తమ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. విజయవాడ సర్కిల్‌ పరిధిలో 57 హెడ్‌పోస్టాఫీసులు, 1517 సబ్‌పోస్టాఫీసులు, 8,995 బ్రాంచ్‌ పోస్టాఫీసులు ఉన్నాయన్నారు. 2020 డిసెంబరు 31నాటికి 9,36,821 సేవింగ్‌ ఖాతాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.15.72కోట్ల ఆదాయం వచ్చిందని, 24,760 ఆర్పీఎల్‌ఐ, 6,404 పీఎల్‌ఐ ఖాతాలు ప్రారంభించామని, ఆధార్‌సేవలు కోసం 578 ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట రాజమహేంద్రవరం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.సూర్యనారాయణ, విజయవాడ సర్కిల్‌ కార్యాలయం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు.Updated Date - 2021-01-20T06:06:46+05:30 IST