గడపగడపకూ తిరిగి సమస్యలు తెలుసుకుంటా
ABN , First Publish Date - 2021-12-09T05:42:17+05:30 IST
పట్టణంలో గడపగ డ పకూ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

రామచంద్రపురం, డిసెంబరు 8: పట్టణంలో గడపగ డ పకూ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం ఆయన 1,2వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేయవలసిన పనులపై ఒత్తిడి తెస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిన పూనిన విధంగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్, కౌన్సిలర్ పైడిమళ్ల సత్తి బాబు, ఉండవిల్లి కృష్ణచౌదరి, పెందుర్తి భానుమూర్తి, జె.భా స్కర్, జాస్తి విజయలక్ష్మి, వంజరపు రాజేశ్వరి, గరికపాటి సూర్యనారాయణ, కొమరిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.