ప్రభ... ముస్తాబు

ABN , First Publish Date - 2021-01-13T05:30:00+05:30 IST

కనుమ రోజు మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి వెళ్లేందుకు ఆయా గ్రామాల ఉత్సవ కమిటీల సభ్యులు ప్రభలను తయారు చేస్తున్నారు.

ప్రభ... ముస్తాబు
గంగలకుర్రు అగ్రహారంలో వీరేశ్వరస్వామి ప్రభను తయారు చేస్తున్న యువకులు

అంబాజీపేట, జనవరి 13: కనుమ రోజు మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి వెళ్లేందుకు ఆయా గ్రామాల ఉత్సవ కమిటీల సభ్యులు ప్రభలను తయారు చేస్తున్నారు. మండలంలోని తొమ్మిది గ్రామాల నుంచి, అయినవల్లి మండలం నేదునూరు, అమలాపురం మండలం పాలగుమ్మి నుంచి ఒక్కొక్క ప్రభ తీర్థానికి వస్తాయి. వీటిని ఆయా గ్రామాల నుంచి ఊరేగింపుగా తీర్థానికి తీసుకువస్తారు. గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి ప్రభ, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి వారి ప్రభలు పంట చేలను తొక్కుకుంటూ, అప్పర్‌ కౌశిక దాటుకుంటూ తీర్థానికి తీసుకువచ్చే  తీరు గగుర్పాటుకు గురిచేస్తుంది. అందుకే ఈ ప్రభల తయారీకి ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 

Updated Date - 2021-01-13T05:30:00+05:30 IST