ఘనంగా రమణ మహర్షి జయంతి

ABN , First Publish Date - 2021-12-31T06:02:10+05:30 IST

ప్రత్తిపాడు, డిసెంబరు 30: మండలంలోని రాచపల్లి రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన 142వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. విశాఖకు చెందిన డాక్టర్‌ కె.సుబ్బారావు జ్యోతిప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించగా సిరిపురం రమణజ్ఞాన సత్సంగం ఉపదేశ పారా

ఘనంగా రమణ మహర్షి జయంతి
రాచపల్లిలో పూజలు చేస్తున్న భక్తులు

ప్రత్తిపాడు, డిసెంబరు 30: మండలంలోని రాచపల్లి రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన 142వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. విశాఖకు చెందిన డాక్టర్‌ కె.సుబ్బారావు జ్యోతిప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించగా సిరిపురం రమణజ్ఞాన సత్సంగం ఉపదేశ పారాయణం నిర్వహించారు. వాసుదేవానంద గిరిస్వామీజీ ప్రణవ పతాక ఆవిష్కరణ చేసి గోపూజ చేశారు. రమణ అష్టోత్తర శతనామార్చన, దక్షిణామూర్తి హోమం జరిపారు. గోర్స దుర్గప్రసాద్‌ అధ్యక్షతన సభ నిర్వహించారు. రాచపల్లి మాజీ సర్పంచ్‌ బుద్దరాజు రామలక్ష్మీచంటిరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా అన్నవరం దేవస్ధానం పాలకమండలి మాజీ సభ్యుడు బుద్దరాజు గోపిరాజు పుష్పమాల అలంకరణ చేయగా మండల ఉపాధ్యక్షుడు ఏనుగు శ్రీనివాస్‌ కార్యక్రమం నిర్వహించారు. వంగలపూడి, శాంతి ఆశ్రమం, తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలం స్వామిజీలు, మాతాజీలు నిలువిశేషానందగిరి మాతాజీ, వినమ్రానంద సరస్వతి మాతాజీ, విద్యానంద మాతాజీ, లక్ష్మాణంద స్వామీజీ, రమణస్మరణానంద స్వామీజీ, అరుణాచల ఉదయస్వామి, కాకినాడకు చెందిన ప్రముఖ దాత ఉండవల్లి బాపిరాజు, రాచపల్లి రమణాశ్రమ నిర్వాహకులు రమణానందస్వామీజీ ప్రసంగించారు. ఆశ్రమంలోని రమణ మహర్షికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శరభవరం రాజరాజేశ్వరి పీఠం స్వామీజీ, రాచపల్లికి చెందిన ప్రముఖులు టీవీఎస్‌ రమేష్‌ పాల్గొన్నారు. పదివేలమంది భక్తులకు అన్నదానం చేశారు. సత్యసాయి సేవాసంస్థ సభ్యులు భక్తులకు సేవలందించారు. 

Updated Date - 2021-12-31T06:02:10+05:30 IST