ప్రసాద్‌ పథకం నిధుల మంజూరుకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-12-27T05:23:44+05:30 IST

కేంద్రప్రభుత్వ పథకమైన ప్రసాద్‌ స్కీం నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రసాద్‌ పథకం నిధుల మంజూరుకు కృషి చేయాలి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సత్యదేవుడి చిత్రపటం అందిస్తున్న అధికారులు

 అన్నవరం, డిసెంబరు 26: కేంద్రప్రభుత్వ పథకమైన ప్రసాద్‌ స్కీం నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, దేవస్థానం ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌, పీఆర్వో కొండలరావు తదితరులు హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అధిక మొత్తంలో విడుదల చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి స్వామివారి ప్రసాదం, అన్నవరం దేవస్థానం పండితుల వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ పథకంలో చేపట్టబోయే పనుల పరిశీలనకు వచ్చేనెలలో కేంద్రబృందం రానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పర్యాటక అధికారులకు స్పష్టం చేశారు. రూ.92.4 కోట్ల ప్రతిపాదనలను పంపినా రూ.50 కోట్ల మేర మాత్రమే నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-27T05:23:44+05:30 IST