నాణ్యమైన ఉత్పత్తులకు మిల్లర్లు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-12-31T05:41:34+05:30 IST
పెద్దాపురం, డిసెంబరు 30: మిల్లర్లు వ్యవసాయపరంగా నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మండల పరిధిలోని వాలుతిమ్మాపురం గ్రామంలో లలితా రైస్ ఇండస్ట్రీస్, పట్టాబి ఆగ్రోఫుడ్స్‌ను గురువారం పరిశీలించారు. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ తయారు చేసే మిషనరీ, పోషక విలువలతో

పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్
పెద్దాపురం, డిసెంబరు 30: మిల్లర్లు వ్యవసాయపరంగా నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మండల పరిధిలోని వాలుతిమ్మాపురం గ్రామంలో లలితా రైస్ ఇండస్ట్రీస్, పట్టాబి ఆగ్రోఫుడ్స్‌ను గురువారం పరిశీలించారు. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ తయారు చేసే మిషనరీ, పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేసే విధానం, ప్యాకేజింగ్ యూనిట్లను పరిశీలించారు. అలాగే ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ కీర్తి చేకూరి, వ్యవసాయశాఖ డీడీ మాధవరావు, పౌర సరఫరాలశాఖ మేనేజర్ లక్ష్మీరెడ్డి, డీఎ్‌సవో ప్రసాదరావు, జిల్లా కోపరేటీవ్ అధికారి దుర్గాప్రసాద్, లలితా ఇండస్ట్రీస్ ఎండీలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేటలో ఆర్‌బీకే పరిశీలన
సామర్లకోట: మండలంలోని అచ్చంపేట రైతు భరోసా కేంద్రాన్ని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి రైతు భరోసాకేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించడం వల్ల లాభనష్టాలపై ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు సకాలంలో పడుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఇప్పటివరకూ ఎన్ని మెట్రిక్‌టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశారో జిల్లా అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సం బంధించి రైతులకు హమాలీ చార్జీలుగా ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను అందజేశారు. జేసీ కీర్తి చేకూరి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు లక్ష్మారెడ్డి, ఎఫ్‌టీసీ డీడీ.అయితే నాగేశ్వరరావు, కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ, డీసీవో దుర్గాప్రసాద్, కాకినాడ ఏడీఏ జీవీ.పద్మశ్రీ, సామర్లకోట తహశీల్దార్ వజ్రపు జితేంద్ర, ఎంఏవో ఐ.సత్య, వీరంరెడ్డి చినబాబు, సోసైటీ అధ్యక్షుడు వీరంరెడ్డి నాని, ఆర్బీకే కమిటీ చైర్మన్ సలాది రమేష్, రైతులు పాల్గొన్నారు.