తపాలా కార్యాలయం తరలింపుపై నిరసన

ABN , First Publish Date - 2021-03-22T06:05:35+05:30 IST

వెలంపాలెంలో 40ఏళ్లుగా ఉన్న తపాలా కార్యాలయం తరలింపుపై గ్రామస్థులు నిరసన తెలిపారు.

తపాలా కార్యాలయం తరలింపుపై నిరసన

ద్రాక్షారామ, మార్చి 21: వెలంపాలెంలో 40ఏళ్లుగా ఉన్న తపాలా కార్యాలయం తరలింపుపై గ్రామస్థులు నిరసన తెలిపారు. వెలంపాలెం, నెలపర్తిపాడు, శివారుపల్లెలు, జగన్నాయకులపాలెం గ్రామాల ప్రజలు వెలంపాలెంలో తపాలా కార్యాలయం సేవలు పొందుతున్నారు. ఇటీవల తపాలా కార్యాలయం కె.గంగవరం మండల  కేంద్రానికి తరలిస్తున్న సమాచారం గ్రామస్థులకు అందింది. దీంతో సర్పంచ్‌ టేకుమూడి సుజాత, మాజీ సర్పంచ్‌ టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు, గ్రామస్థులు తపాలా కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. వినతిపత్రాన్ని పోస్టుమాస్టర్‌కు అందజేశారు. దీనిపై మాజీ సర్పంచ్‌ టేకుమూడి సత్యనారాయణ జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సూర్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. తరలింపును నిలుపుదల చేయాలని కోరారు. ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చినట్లు టేకుమూడి తెలిపారు. కార్యక్రమంలో మండల మహిళాసమాఖ్య అధ్యక్షురాలు వాసంశెట్టి లావణ్య, స్వయంశక్తి సంఘాల మహిళలు, పంచాయతీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.Updated Date - 2021-03-22T06:05:35+05:30 IST