పోస్టాఫీసులో తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-30T06:48:42+05:30 IST

మోతుగూడెం పోస్టాఫీసులో రాజమహేం ద్రవరం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేవీవీ సత్యనారాయణ బుధవారం తనిఖీలు నిర్వహించారు.

పోస్టాఫీసులో తనిఖీలు

మోతుగూడెం, డిసెంబరు 29: మోతుగూడెం పోస్టాఫీసులో రాజమహేం ద్రవరం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేవీవీ సత్యనారాయణ బుధవారం తనిఖీలు నిర్వహించారు. పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి పోస్టాఫీసు ను చింతూరుకు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని తెలపగా అటువంటి దేమీ లేదని చెప్పారు. దీనిని బ్రాంచ్‌ పోస్టాఫీసుగా చేశామన్నారు. నెట్‌వర్క్‌కు సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఇతర నెట్‌వర్క్‌ అధికారులతో ఇప్పటికే మాట్లాడా మని చెప్పారు. చింతూరులో సబ్‌ డివిజన్‌ పోస్టాఫీసును అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, నెల్లిపాక, వీఆర్‌పు రం, కూనవరం, తోటపల్లి పోస్టాఫీసులు దాని పరిధిలోకి వస్తాయన్నారు.

Updated Date - 2021-12-30T06:48:42+05:30 IST