పేదల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ కృషి

ABN , First Publish Date - 2021-09-03T06:10:07+05:30 IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమానికి కృషి చేశారని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.

పేదల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ కృషి

రాజమహేంద్రవరం అర్బన్‌/సిటీ, సెప్టెంబరు 2: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమానికి కృషి చేశారని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ఆర్‌ వర్థంతిని జిల్లాలో పలుచోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహిం చారు. స్థానిక పేపర్‌మిల్లు గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసాయి కల్యాణ మండపంలో రాజమహేంద్రి విద్యాసంస్థల ఛైర్మన్‌ టీకే విశ్వేశ్వరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. దీనికి ఎంపీ భరత్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎన్నో రకాల రోగాలకు ఉచితంగా చికిత్స అందేలా చేశారని ఎంపీ అన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాను నమ్మినవారిని ఎంతగానో ఆదరించేవారని, దీనికి తన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. విశ్వేశ్వరరెడ్డి, రాజమహేంద్రవరం స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పలువురు వైసీపీ నాయకులు, ప్రభుత్వాసుపత్రి బ్లడ్‌బ్యాంకు డాక్టర్‌ సుజాత, సిబ్బంది, జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ బ్లడ్‌ బ్యాం కు సెంటర్‌ ఇన్‌ఛార్జి పట్నాయక్‌, రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్‌ స్వరూపరెడ్డి, ప్రిన్సిపాల్‌ తేతలి సత్యసౌందర్య పాల్గొన్నారు. 49వ డివిజన్‌లో మాసా రామ్‌జోగ్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలతో నివాళుల ర్పించారు. అలాగే స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌, బెజవాడ రంగా, చింతాడ వెంకటేశ్వరావులు వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.

Updated Date - 2021-09-03T06:10:07+05:30 IST