కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T05:37:48+05:30 IST

పట్టణంలోని రైస్‌మిల్లుల నుంచి వస్తున్న నల్లబూడిద, కాలుష్యాన్ని ని యంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ పిల్లి శ్రీనివాస్‌, కో-అప్షన్‌ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, టీడీపీ కౌన్సిలర్లు యరమాటి గంగరాజు, చుండ్రు సుబ్బారావు చౌదరి ప్రశ్నించారు

కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

కౌన్సిల్‌ సమావేశంలో సభ్యుల డిమాండ్‌

మండపేట, డిసెంబరు 30: పట్టణంలోని రైస్‌మిల్లుల నుంచి వస్తున్న నల్లబూడిద, కాలుష్యాన్ని ని యంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ పిల్లి శ్రీనివాస్‌, కో-అప్షన్‌ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, టీడీపీ కౌన్సిలర్లు యరమాటి గంగరాజు, చుండ్రు సుబ్బారావు చౌదరి ప్రశ్నించారు. చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన గురువారం మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం జరిగింది. కాలుష్య నియంత్రణకు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్టు అధికారులు సమా ధానం చెప్పారు. పట్టణంలో దోమలు, కుక్కల నియం త్రణకు చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. పలు తీర్మానాలను ఆమోదిం చారు. పట్టణంలో ని సమస్యలను కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకొ చ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి నారాయణరావు, వీవీఎస్‌ఎస్‌ చౌదరిలతో పాటు మాజీ కౌన్సిలర్‌ గంటినాయుడు మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు వేగుళ్ల నారయ్యబాబు, పిల్లి గణేశ్వరరావు, కమిషనరు టి.రామ్‌కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:37:48+05:30 IST