విహారయాత్రలో విషాదం

ABN , First Publish Date - 2021-10-31T05:36:51+05:30 IST

పొల్లూరు జలపాతం వద్దకు స్నేహితులతో వచ్చిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన పోలురెడ్డి కల్యాణ్‌ (21) తాడేపల్లిగూడెంలో బీటెక్‌ చదువు తున్నాడు.

విహారయాత్రలో విషాదం

 యువకుడి మృతి
మోతుగూడెం, అక్టోబరు 30: పొల్లూరు జలపాతం వద్దకు స్నేహితులతో వచ్చిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన పోలురెడ్డి కల్యాణ్‌ (21) తాడేపల్లిగూడెంలో బీటెక్‌ చదువు తున్నాడు. కళ్యాణ్‌ తన ఐదుగురు స్నేహితులతో కలిసి శనివారం బైక్‌లపై పొల్లూరు జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చాడు. స్నానం చేసేందుకు అందరూవాగులోకి దిగారు. కల్యాణ్‌ నీటిలో మునిగి పోయాడు. స్నేహితులంతా చూడగా  ఆచూకీ లభించలేదు. దీంతో వారు మోతుగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వాసంశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానికుల సహాయంతో ఈతగాళ్లు గాలించగా  కొంతదూరంలో జలపాతంలో కళ్యాణ్‌ మృతదేహం కనిపించింది. దీంతో స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.  మృతదేహాన్ని చింతూరు గవర్నమెంట్‌ హాస్పటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Updated Date - 2021-10-31T05:36:51+05:30 IST