ప్రజల రక్షణ కోసం పోలీసింగ్‌ పెంచాం

ABN , First Publish Date - 2021-08-20T06:52:42+05:30 IST

నేరాలు అదుపు చేసి ప్రజలకు రక్షణ ఇవ్వడంకోసం పోలీసింగ్‌ను విస్తృ త పరిచామని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల రక్షణ కోసం పోలీసింగ్‌ పెంచాం

  • వాహనాల నంబర్‌ ప్లేట్లపై స్పెషల్‌ డ్రైవ్‌
  • 14,187 కేసులు నమోదు
  • నోమాస్క్‌ వ్యక్తులపై 18,381 కేసులు
  • ఓపెన్‌ డ్రింకింగ్‌ పైదాడి చేసి  2030 కేసులు
  • సారాపై 387 కేసులు నమోదు చేశాం
  • బ్లేడ్‌ బ్యాచ్‌ ఏపార్టీకి చెందినా వదలం
  • మీడియా సమావేశంలో అర్బన్‌ ఎస్‌పీ ఐశ్వర్య రస్తోగి

రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నేరాలు అదుపు చేసి ప్రజలకు రక్షణ ఇవ్వడంకోసం పోలీసింగ్‌ను విస్తృ త పరిచామని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యమిచ్చా మని, దీనిలోభాగంగా ప్రత్యేక డ్రైవ్‌తో 14,187 నెంబర్లు ప్లేట్లు సరిగ్గాలేని వాహనాలను గుర్తించి, రూ.14,18,700 అపరాధ రుసుం వసూలు చేశామని. మాస్కులు ధరించకుండా వాహనాలు నడిపే వారిని 18,381 మందిని గుర్తించి రూ.16,20,100 అపరాధ రుసుమ విధించామని తెలిపారు. కొందరు మారు మూల ప్రాంతాలు, హైవేలు, జనసంచారం లేనిచోట బహిరంగంగానే మద్యం తాగుతున్నారని, అటువంటి వారు నేరాలకు పాల్పడవచ్చనే కారణంతో తనిఖీలు మొదలెట్టామని చెప్పారు. వీరిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 2035 కేసులు నమోదు చేశామన్నారు. సారా తయారీ, తరలింపునకు సంబంధించి 387 కేసులు నమోదు చేసి 8412 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని, 1,75,500 బెల్లపు ఊటను ధ్వంసం చేశామని ఎస్పీ తెలిపారు. అర్బన్‌ జిల్లాలో 189 అభద్రత, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి నిరంతరం పోలీసు, దిశ, పెట్రోలింగ్‌ సిబ్బందితో ముమ్మర గస్తీ ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల 74వేల మంది మొబైళ్లలో దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశామన్నారు.

ఫ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా బ్లేడ్‌ బ్యాచ్‌ను వదలం

బ్లేడ్‌బ్యాచ్‌పై ప్రత్యేక నిఘాపెట్టామని, 140మందిని గుర్తిం చి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చామని ఎస్పీ తెలిపారు. వారి పూర్తి వివరాలు సేకరించామని, వారు ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నా సరే వదలబోమని అన్నారు. రాజకీయాలు, మతాలు, కులాలకతీతంగా కేసులు నమోదు చేసి ఇటువంటి బ్యాచ్‌లను అణచి వేస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్య ఉందని, చాలాచోట్ల రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెడుతున్నారని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-08-20T06:52:42+05:30 IST