మళ్లీ ముంపులోకి దేవీపట్నం గ్రామాలు

ABN , First Publish Date - 2021-06-22T06:24:43+05:30 IST

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో గోదావరి పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద లేకపోయినా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం దేవీపట్నం మం డలం గ్రామాలను కలవరపెడుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికల్లా గోదావరి నీటిమట్టం క్రమేణా పెరిగిపోయింది. ముఖ్యంగా మండలంలో సీతపల్లివాగు వద్ద ఉన్న బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో మండల కేంద్రం నుంచి మైదాన ప్రాంతాలైన గోకవరం, సీతానగరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే వరదనీరు మంగళవారం

మళ్లీ ముంపులోకి దేవీపట్నం గ్రామాలు
గోదారి వరదనీరు చేరిన సీతపల్లివాగు

కాఫర్‌ డ్యామ్‌ కారణంగా వరద రాకుండానే మొదలైన ముప్పు

దేవీపట్నంలో ఇళ్లను చుట్టుముడుతున్న గోదావరి

రంపచోడవరం/దేవీపట్నం, జూన్‌ 21: పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో గోదావరి పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద లేకపోయినా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం దేవీపట్నం మం డలం గ్రామాలను కలవరపెడుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికల్లా గోదావరి నీటిమట్టం క్రమేణా పెరిగిపోయింది. ముఖ్యంగా మండలంలో సీతపల్లివాగు వద్ద ఉన్న బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో మండల కేంద్రం నుంచి మైదాన ప్రాంతాలైన గోకవరం, సీతానగరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే వరదనీరు మంగళవారం కూడా కొనసాగితే మండలంలో గోదావరి పరీవాహక ప్రాంతాలైన కొండమొదలు, నడిపూడి, తెలుపేరు, కె-గొందూరు, కచ్చు లూరు, తాళ్లూరు, సుద్దకొండ, మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, దేవిపట్నం, తొయ్యూరు, పూడిపల్లి, పోచమ్మగండి తదితర గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వరదనీరు ఎక్కువవ్వడంతో పలు గ్రామా ల నిర్వాసితులు తమ గ్రామాలు ఖాళీ చేసి మైదాన ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. ఇక దేవీపట్నం గ్రామంలోనూ పలు ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఇదిలాఉండగా దేవీపట్నం ఎగువ ప్రాంతంలో ఉన్న గొందూరు, తాళ్లూరు గ్రామాల మధ్య కూడా గోదావరి పెరిగి ఉన్న రహదారి మార్గం కూడా ముంపునకు గురవుతోంది. ఈసారి వరద వస్తే కాఫర్‌ డ్యామ్‌ కారణంగా వరద నీరు సులభంగా కిందకు వెళ్లే పరిస్థితి ఉండదన్నది అంచనా. కాగా వరద రాకుండానే సాధారణ ప్రవాహం కూడా కిందకు వెళ్లకుండా కాఫర్‌ డ్యామ్‌ అడ్డుపడుతోంది. కాఫర్‌ డ్యామ్‌ నుంచి స్పిల్‌వేలోకి నీటిని మళ్లించే చర్యలను ఇటీవలే ప్రారంభించినా, కిందకు వెళ్లే గోదావరి కంటే, నిల్వ ఉండే జలాలే ఎక్కువకావడంతో ఎగువ నుంచి వచ్చే వరద లేకపోయినా గోదావరి ముంచుతోంది. రానురాను ఇది మరింత తీవ్రంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-06-22T06:24:43+05:30 IST