అంగన్‌వాడీలో ప్లాస్టిక్‌ బియ్యం!

ABN , First Publish Date - 2021-08-21T05:30:00+05:30 IST

మండలంలోని వడ్డిగూ డెం పంచాయ తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ప్రత్యక్షమయ్యాయి.

అంగన్‌వాడీలో ప్లాస్టిక్‌ బియ్యం!

  • ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు
  • పోర్టీఫైడ్‌ రైస్‌గా నిర్ధారించిన అధికారులు

వరరామచంద్రాపురం, ఆగస్టు 21: మండలంలోని వడ్డిగూ డెం పంచాయ తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ప్రత్యక్షమయ్యాయి. వాటిని గర్భిణులు అం గన్‌వాడీ కేంద్రానికి తిరిగి ఇచ్చేశారు. ఇది తెలుసుకున్న టీడీపీ నాయకులు ముత్యాల రామారావు, ముత్యాల చంద్రశేఖర్‌, సిద్ధు, నాగు,  ముత్యాల శ్రీను సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వీఆర్‌పురం తహశీ ల్దార్‌కు తెలియజేసి అంగన్‌వాడీ కేంద్రానికి పంపించారు. తహశీల్దార్‌ వాటిని పరిశీలించి, ఇవి పోర్టుఫైడ్‌ రైస్‌గా నిర్ధారణ చేశారు. ఇవి బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పోషకాలను అందిస్తాయని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ డీఈవో సాయి తెలిపారు. ఈ బియ్యాన్ని క్వాలిటీ కంట్రోల్‌కు టెస్టింగ్‌ కోసం పంపుతున్నామని తహశీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2021-08-21T05:30:00+05:30 IST