ప్లాస్టిక్‌ బియ్యం కాదు.. పోర్టిఫైడ్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-07-27T05:39:47+05:30 IST

మండలంలోని లబ్బర్తి పంచాయతీ నెల్లిమెట్ల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద పంపిణీ చేసినవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, పోర్టిఫైడ్‌ బియ్యమని తహశీల్దారు వైవీ సుబ్రహ్మణ్యాచార్యులు తెలిపారు.

ప్లాస్టిక్‌ బియ్యం కాదు.. పోర్టిఫైడ్‌ బియ్యం

రాజవొమ్మంగి, జూలై 26: మండలంలోని లబ్బర్తి పంచాయతీ నెల్లిమెట్ల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద పంపిణీ చేసినవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, పోర్టిఫైడ్‌ బియ్యమని తహశీల్దారు వైవీ సుబ్రహ్మణ్యాచార్యులు తెలిపారు. నెల్లిమెట్ల అంగన్‌వాడీలో ఇచ్చిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిసాయని బీజేపీ మండలాధ్యక్షుడు తాము సూరిబాబు ఆరోపించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్‌ సదరు కేంద్రాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని పరిశీలించారు. అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు ప్రత్యేకంగా పంపుతున్న పోర్టిఫైడ్‌ బియ్యమని వెల్లడించారు.

Updated Date - 2021-07-27T05:39:47+05:30 IST