1 నుంచి ప్లాస్టిక్‌ వినియోగం నిషిద్ధం

ABN , First Publish Date - 2021-12-30T06:47:04+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 29: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నామని, ఇందుకు తమవంతుగా జనవరి 1 నుంచి కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తున్నామని నగరపాలకసంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌

1 నుంచి ప్లాస్టిక్‌ వినియోగం నిషిద్ధం

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 29: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నామని, ఇందుకు తమవంతుగా జనవరి 1 నుంచి కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తున్నామని నగరపాలకసంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడను సుంద రంగా, కాలుష్యరహిత సురక్షిత నగరంగా మార్చడంలో ప్రజలందరూ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ కాకినాడ సాధనకు పాటుపడతామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.Updated Date - 2021-12-30T06:47:04+05:30 IST