ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST

పిఠాపురం, ఆగస్టు 25: ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని చేర్చి రూ.75లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగులకు పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. అన్ని ప్ర

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం, ఆగస్టు 25: ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని చేర్చి రూ.75లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగులకు పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండేపల్లి సూర్యావతి, సబ్‌ ట్రెజరీ అధికారి ఎండీ అహ్మద్‌ అలీ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-25T05:30:00+05:30 IST