కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-01-12T05:46:49+05:30 IST

పిఠాపురం, జనవరి 11: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదాలు, గుండాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం

కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
పిఠాపురంలో స్వాధీనం చేసుకున్న కోడి కత్తులను చూపుతున్న సీఐ

పిఠాపురం సీఐ రామచంద్రరావు 

59 కోడికత్తులు స్వాధీనం 

పిఠాపురం, జనవరి 11: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదాలు, గుండాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు హెచ్చరించారు. ఇంటి వద్దే కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. గతంలో పందాలు నిర్వహించిన వారు, ప్రస్తుతం నిర్వహణకు సిద్ధమవుతున్నవారిపై 18 కేసులు నమోదు చేసి 74 మందిని బైండోవర్‌ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 59 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో పిఠాపురం రూరల్‌, కొత్తపల్లి, గొల్లప్రోలు ఎస్‌ఐలు పార్థసారధి, నబీ, రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T05:46:49+05:30 IST