పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-21T06:51:54+05:30 IST

పిఠాపురంలో బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శన నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

పిఠాపురం, అక్టోబరు 20:  పిఠాపురంలో బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శన నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొంతసమయం తర్వాత వైసీపీ అందోళనలు చేయడంతో పాటు చంద్రబాబు తదితరుల దిష్టిబొమ్మలు దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్మ స్టేషన్‌ బయటకు వచ్చి నిరసన తెలిపారు. తాము అందోళన చేస్తుంటే నాలుగు గంటలకు పైగా నిర్బంధించారని, వైసీపీకి మాత్రం బందోబస్తు ఇచ్చి దగ్గరుండి ఆందోళనలు చేయిస్తారా అంటూ పోలీసుల తీరుపై వర్మ మండిపడ్డారు. జగన్‌ దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు దహనం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.  అంతకు ముందు టీడీపీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్‌ మీదుగా మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఉప్పాడ సెంటర్‌ వద్దకు వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాకినాడ డీఎస్పీ భీమారావు పిఠాపురం వచ్చారు. వర్మ తదితరులతో చర్చలు జరిపి స్టేషన్‌ నుంచి పంపివేశారు. జిల్లా అదనపు ఎస్పీ కరణం కుమార్‌ పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-21T06:51:54+05:30 IST