పిఠాపురం 11వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-09T06:41:02+05:30 IST

పిఠాపురం, నవంబరు 8: పిఠాపురంలోని 11వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ డమ్మీ అభ్యర్థి ముందుగానే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి జనపరెడ్డి రాం బాబు నామినేషన్‌ ఉపసంహరణపై చివరి వరకూ

పిఠాపురం 11వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవం

పిఠాపురం, నవంబరు 8: పిఠాపురంలోని 11వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ డమ్మీ అభ్యర్థి ముందుగానే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి జనపరెడ్డి రాం బాబు నామినేషన్‌ ఉపసంహరణపై చివరి వరకూ ఉత్కంఠ ఉన్నా వైసీపీ నాయకులు చర్చలు జరిపి ఉపసంహరింపచేశారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును కలిశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వైసీపీ అభ్యర్థి అరిగెల వరలక్ష్మి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. 

Updated Date - 2021-11-09T06:41:02+05:30 IST