పెట్రో ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:49:18+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని పెంచిన పెట్రోలు డీజిల్‌ వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలు తగ్గించాలి

రాజానగరం, అక్టోబరు 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని పెంచిన పెట్రోలు డీజిల్‌ వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం రాజానగరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ డివిజన్‌ నాయకుడు గుత్తుల వెంకటరమణ, ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ డివిజన్‌ కార్యదర్శి ఎం.భవాని, పార్టీ నాయకులు నీల సూర్యారావు, సూరమ్మ, తోటకూర బేబి, వీరబాబు, నక్కా లక్ష్మి, మంగ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:49:18+05:30 IST