సీనియర్ కౌన్సిలర్లకు గౌరవమేది?
ABN , First Publish Date - 2021-10-30T05:27:17+05:30 IST
పెద్దాపురం, అక్టోబరు 29: మున్సిపల్ కౌన్సిల్లో సీనియర్ కౌన్సిలర్లకు గౌరవం లేదు, వారికి కనీసం ఇచ్చే మర్యాద కూడా సరిగా ఉండడం లేదని కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ బొడ్డు తులసీమంగతా
కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్
వాడివేడిగా పెద్దాపురం కౌన్సిల్ సమావేశం
పెద్దాపురం,
అక్టోబరు 29: మున్సిపల్ కౌన్సిల్లో సీనియర్ కౌన్సిలర్లకు గౌరవం లేదు,
వారికి కనీసం ఇచ్చే మర్యాద కూడా సరిగా ఉండడం లేదని కౌన్సిలర్ విజ్జపు
రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
చైర్‌పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన శుక్రవారం జరిగింది.
కౌన్సిలర్ రాజశేఖర్ మాట్లాడుతూ కమిషనర్ తమతో సంప్రదించకుండానే ఆయన పనులు
చేసుకుపోతున్నారని, ఇది ఎంతమాత్రం సముచితంకాదన్నారు. దీంతో సమావేశం
వాడివేడిగా ప్రారంభమైంది. అనంతరం మున్సిపల్ ప్యానల్ కమిటీలను వైస్
చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ చదివి వినిపించగా దీనిపై కౌన్సిలర్
రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో సీనియర్ అయిన తనకు చాలా అవమానం
జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైస్ చైర్మన్ సాయిప్రసాద్
కల్పించుకుని కౌన్సిల్లో అంతా సమానమే అని, ఎవరినీ అవమానించే విధంగా
వ్యవహరించలేదన్నారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి సమష్టిగా
పనిచేయాలన్నారు. కౌన్సిలర్ త్సలికి సత్యభాస్కర్రావు మాట్లాడుతూ
సంతమార్కెట్ స్థలాన్ని మున్సిపాలిటీ ఆర్టీసీకి అప్పగించిందని, కానీ
ఆర్టీసీ సంస్థ కాంప్లెక్స్ స్థలాన్ని మున్సిపాలిటీకి ఎందుకు అప్పగించలేదని
ప్రశ్నించారు. అనంతరం పలువురు వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు.
కార్యక్రమంలో కమిషనర్ సురేంద్ర, శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు తదితరులు
పాల్గొన్నారు.