భూ రీసర్వేను వేగంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-10-20T05:13:21+05:30 IST

గండేపల్లి, అక్టోబరు 19: భూ రీసర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ అధికారు లను ఆదేశించారు. పెద్దాపురం డివిజన్‌ గండేపల్లి మండలం ఎన్టీ రాజపురంలో భూ రీసర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. విలేజ్‌ బౌండరీ జంక్షన్‌, గ్రౌండ్‌ కంట్రోల్‌

భూ రీసర్వేను వేగంగా పూర్తిచేయాలి
ఎన్టీ రాజపురంలో భూ రీసర్వేను పరిశీలిస్తున్న పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ 

గండేపల్లి, అక్టోబరు 19: భూ రీసర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ అధికారు లను ఆదేశించారు. పెద్దాపురం డివిజన్‌ గండేపల్లి మండలం ఎన్టీ రాజపురంలో భూ రీసర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. విలేజ్‌ బౌండరీ జంక్షన్‌, గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయిం ట్‌, స్టోన్‌ ప్లాంటేషన్‌, కోఆర్డినేట్స్‌, రోవర్‌ పాలంటేషన్‌, సర్వే రాళ్లను ఆర్డీవో రైతుల సమక్షంలో పరిశీలించి రైతుల పొలా ల్లో సరిహద్దుల్లో సర్వేరాళ్లు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొలాల్లో సరిహద్దుల సర్వేరాళ్లు వేస్తున్నామన్నారు. రైతులు 50మంది బృందాలుగా ఏర్పడి వారి పొలాల్లోని సరిహద్దు రాళ్లు సంబంధిత అధికారుల సమక్షంలో వేయించుకోవాలన్నారు. రైతులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తహశీల్దార్‌ చిన్నారావు, మండల సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వో, సచివాలయ సర్వేయర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:13:21+05:30 IST