నేటి నుంచి మరిడమ్మ జాతర
ABN , First Publish Date - 2021-07-08T05:59:54+05:30 IST
భక్తుల కొంగు బం గారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆషా ఢమాస జాతర మ హోత్సవాలను కొవిడ్ నిబంధనల నడుమ నిరాడంబరంగా నిర్వహించనున్నా ు. ఈ నెల 8 తేదీ నుంచి ఆగస్ట్ 14 తేదీ వరకూ సుమారు 36 రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి తెలిపారు.

పెద్దాపురం, జూలై 7 : భక్తుల కొంగు బం గారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆషా ఢమాస జాతర మ హోత్సవాలను కొవిడ్ నిబంధనల నడుమ నిరాడంబరంగా నిర్వహించనున్నా ు. ఈ నెల 8 తేదీ నుంచి ఆగస్ట్ 14 తేదీ వరకూ సుమారు 36 రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సహాయ కమిషనర్ కోరారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆమె సూచించారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి వీధి సంబరాలను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు.