నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-12-31T06:07:24+05:30 IST

ఇటీవల మృతి చెందిన ఆశావర్కర్ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు పి.రామరాజు డిమాండ్‌ చేశారు.

నష్టపరిహారం చెల్లించాలి

గంగవరం, డిసెంబరు 30: ఇటీవల మృతి చెందిన ఆశావర్కర్ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు పి.రామరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక పీహెచ్‌సీ ఎదుట ఆశావర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షాశిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఇటీ వల ఐదుగురు ఆశావర్కర్లు మృతిచెందారని, వారి కుటుంబాలను ప్రభుత్వం, ఐటీడీఏ ఆదుకునే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని అన్నారు. కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన చేపడితే ఉన్నతాధికారులు హామీలిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చనిపోయిన ఆశావర్కర్ల కుటుంబాలకు అధికారులేమి న్యాయం చేశారో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్‌ యూనియన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:07:24+05:30 IST