నేరుగా పవన్ కల్యాణే రంగంలోకి దిగుతారు: దుర్గేష్

ABN , First Publish Date - 2021-09-04T01:13:46+05:30 IST

నేరుగా పవన్ కల్యాణే రంగంలోకి దిగుతారు: దుర్గేష్

నేరుగా పవన్ కల్యాణే రంగంలోకి దిగుతారు: దుర్గేష్

రాజమండ్రి: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న శ్రమదానం ద్వారా రోడ్లు మరమ్మతులు చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు.  దీనికి నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని, రెండు జిల్లాల్లో ఆయన స్వయంగా రోడ్ల మరమ్మతు పనుల్లో పాల్గొంటారని దుర్గేష్  పేర్కొన్నారు.  


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కరోనా సమయంలో సేవలు అందించిన జనసైనికులకు జ్ఞాపికలు, ఇన్సూరెన్స్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాస్, పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జనసేన లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. జనసైనికులంతా క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, అధికారంలోకి వచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-09-04T01:13:46+05:30 IST