పవిత్రోత్సవాల్లో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-11-02T06:56:11+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

పవిత్రోత్సవాల్లో ప్రత్యేక పూజలు

మామిడికుదురు, నవంబరు 1: అప్పనపల్లి బాలబాలాజీస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం చతుష్టానార్చనలు, పవిత్ర అవరోహణ, మహా పూర్ణాహుతి, ఏకాదశ ఫలరస సహిత అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజన సేవ, శాంతికల్యాణం, మహదాశీర్వచనంలను గుడివా డకు చెందిన చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ ప్రధానా ర్చకుడు ఎంటీ సింగరాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యుల ఆధ్వ ర్యంలో శాస్ర్తోక్తంగా జరిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక చిన్నా, సహాయ కమిషనరు పి.బాబూరావు, పాలకమండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-02T06:56:11+05:30 IST