పట్టా భూములను స్వాధీనం చేయాలని వినతి

ABN , First Publish Date - 2021-10-20T04:57:42+05:30 IST

ఆలమూరు గోదావరి లంకలోని మిగులు భూమిని దళితులకు అందించిన పట్టా భూములను స్వాధీనం చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎఫ్‌ఎల్‌ఎంపిఆర్‌కె కోఆపరేటివ్‌ సొసైటీ తరఫున రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులతోపాటు పలువురికి వినతిపత్రం పంపించామని సొసైటీ అధ్యక్షుడు యాళ్ల అనసూయ నరసింహమూర్తి తెలిపారు.

పట్టా భూములను స్వాధీనం చేయాలని వినతి

ఆలమూరు, అక్టోబరు 19: ఆలమూరు గోదావరి లంకలోని మిగులు భూమిని దళితులకు అందించిన పట్టా భూములను స్వాధీనం చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎఫ్‌ఎల్‌ఎంపిఆర్‌కె కోఆపరేటివ్‌ సొసైటీ తరఫున రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులతోపాటు పలువురికి వినతిపత్రం పంపించామని సొసైటీ అధ్యక్షుడు యాళ్ల అనసూయ నరసింహమూర్తి తెలిపారు. మూడున్నర దశాబ్ధాల క్రితం ఇచ్చిన పట్టా భూములు అన్యాక్రాంతమై ఇతరుల చేతుల్లో ఉన్నాయన్నారు. వీరితోపాటు సీఎం, మాజీ సీఎం, పలువురు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు పంపించామని చెప్పారు. 
Updated Date - 2021-10-20T04:57:42+05:30 IST